![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -288 లో.... రుద్రాణి కుట్రలో భాగంగా అరుణ్ ని రాహుల్ రెసార్ట్ కి రప్పిస్తాడు. స్వప్న కడుపులో బిడ్డకి నేనే తండ్రిని అని అరుణ్ ని చెప్పమని రాహుల్, రుద్రాణి చెప్తారు. దాంతో రాహుల్ వచ్చి చెప్పాలని అనుకుంటాడు. ఆలోపు కావ్య, స్వప్న, పద్మావతి ముగ్గురు అరుణ్ ని చూసి ఒక తాగుబోతు సహాయంతో అరుణ్ ని పట్టుకొని కొడతారు. వారి నుండి అరుణ్ తప్పించుకోబోతుంటే కనకం కర్రతో అరుణ్ ని కొడుతుంది. ఆ దెబ్బకు అరుణ్ అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. ఇక అందరు కలిసి అరుణ్ ని ఒక గదిలోకి తీసుకోని వెళ్లి, ఆ తాగుబోతు సహాయంతో అరుణ్ ని కట్టివేసి నోటికి ప్లాస్టర్ వేస్తారు.
మరొకవైపు అరుణ్ ఫోన్ కి రాహుల్ ఫోన్ చేస్తుంటాడు. ఒకసారి రింగ్ అవుతుంది.. ఆ ఫోన్ ని అరుణ్ జేబులో నుండి కావ్య తీసి చూసేలోపు ఫోన్ స్విచాఫ్ అవుతుంది. వీడు నాతో మాట్లాడలేక ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడని రాహుల్ అనుకుంటాడు. ఒకవైపు రాహుల్, మరొకవైపు రుద్రాణి, ఇంకొకవైపు విక్కీ వాళ్ళ బావ కలిసి అరుణ్ కోసం రెసార్ట్ మొత్తం వెతుకుతుంటారు. అదేసమయంలో రాజ్ , విక్కీ ఇద్దరు బార్ కి వెళ్తారు. కానీ డ్రింక్ చెయ్యడానికి కాదు ప్రశాంతంగా మాట్లాడుకోవడానికని విక్కీతో రాజ్ అంటాడు. బేరర్ ని రాజ్ పిలిచి.. మేం తాగుబోతులం కాదు, మాక్ టేల్ తీసుకోని రమ్మని చెప్పగా..
అతను కాక్ టేల్ తీసుకోని వస్తాడు. అది రాజ్ , విక్కీ ఇద్దరు తాగుతారు. అలా రెండు మందు గ్లాసులు కాస్త నాలుగు గ్లాసులుగా మారతాయి. కాసేపటికి ఇద్దరు మత్తులోకి వెళ్తారు. నీ పెళ్లి గురించి చెప్పమని విక్కీని రాజ్ అడుగుతాడు. పద్మావతి అంటే ఇష్టమని విక్కీ చెప్తుంటాడు. మరొక వైపు కావ్య, పద్మావతి ఇద్దరు తమ భర్తలు ఎక్కడికీ వెళ్లారోనని ఎదురుచూస్తూ కూర్చొని ఉంటారు. అలాగే పద్మావతి విక్కీ గురించి కావ్యకి చెప్తుంటుంది.
మరొకవైపు అనామిక మెహందీ కంటే అప్పు మెహందీ బాగుందని కళ్యాణ్ చెప్పడంతో అనామిక అలుగుతుంది. దాంతో అనామికని బుజ్జగించే పనిలో కళ్యాణ్ ఉంటాడు. అదేసమయంలో రాజ్, విక్కీ ఇద్దరు కూల్ డ్రింక్ బదులు వాళ్ళకే తెలియకుండా ఫుల్ డ్రింక్ చేస్తుంటారు. అంతే కాకుండా వాళ్ళ రూమ్స్ కి కూడా తీసుకోని వెళ్తారు. రాజ్, విక్కీ ఇద్దరు తమ గదులలోకి వెళ్లిపోగానే వాళ్ళు తీసుకోని వెళ్లిన డ్రింక్స్ ని కావ్య, పద్మావతి కూడా తాగి తమ భర్తలతో మైకంతో మాట్లాడతారు. ఒక గదిలో కావ్య తనలో ఉన్న ప్రేమని రాజ్ కి చెప్తుంటుంది. మరోగదిలో పద్మావతిపై ఉన్న ప్రేమని విక్కీ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |